విశాఖ ఎయిర్పోర్ట్ వినోద్ నగర్ కు చెందిన మైలపల్లి దిలీప్ కుమార్ అనే యువకుడు స్నేహితులతో కలిసి మద్యం సేవించేందుకు వెళ్ళినప్పుడు హత్యకు గురయ్యాడు. ఈ నెల 1న జరిగిన ఈ ఘటనలో, రైల్వే బ్రిడ్జి వద్ద ఏం జరిగిందో తెలియదు కానీ, దిలీప్ కుమార్ రక్తపు మడుగులో పడి ఉండగా అతన్ని 108 ద్వారా కేజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి అతను మృతి చెందాడు. హత్యకు గల కారణాలపై ఎయిర్పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.