ఉత్తరాంధ్ర కల్పవల్లిగా భక్తులచే పూజలందుకుంటున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. మాసోత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ ఎం. ఎన్. హరేందిర ప్రసాద్, ఆలయ ఈవో కె. శోభారాణి ఇప్పటికే పర్యవేక్షించారు. తొలి రోజు భారీగా భక్తులు తరలివచ్చారు.