మందుల ధరలు తగ్గించాలని, నకిలీ ఔషధాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం విశాఖ జగదాంబ సెంటర్‌లో నిరసన కార్యక్రమం జరిగింది. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ నేతలు చంద్రమౌళి, శ్రీనివాసరావు మాట్లాడుతూ మందులపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేసి, ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలను బలోపేతం చేయడం ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందించాలని కోరారు. కార్పొరేట్ శక్తుల లాభాపేక్ష వల్ల సామాన్యుడిపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేసిన ప్రతినిధులు, నాణ్యమైన మందులను సరసమైన ధరలకే అందించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తూ ప్రజలకు అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు.