విశాఖ: వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవంలో ఎమ్మెల్యే

1చూసినవారు
విశాఖ: వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవంలో ఎమ్మెల్యే
శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 333వ సజీవ సమాధి ఆరాధన మహోత్సవంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారికి ప్రసాదాన్ని సమర్పించారు. ఎన్నికల సమయంలో ఈ ఆలయాన్ని దర్శించుకోవడం తనకు సెంటిమెంట్‌గా భావిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. విశ్వబ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను త్వరలోనే నెరవేరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ విజయలక్ష్మి నరసింహ చారి, మాజీ కార్పొరేటర్ ఉమా మహేష్, స్థానిక నేతలు, కూటమి ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్