విశాఖ: జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్ కల్యాణ్

0చూసినవారు
విశాఖ: జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్ కల్యాణ్
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూ పార్కును సందర్శించారు. తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా, జూలోని రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వాటి సంరక్షణకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని తెలిపారు. అనంతరం, ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్‌ను ప్రారంభించి, ఏనుగులు, జిరాఫీలకు స్వయంగా ఆహారం తినిపించారు. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కంబాలకొండ ఎకో పార్కులో నగరవనాన్ని కూడా ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్