వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్.
జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం పార్టీ విశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, కమిటీల నిర్మాణం, సభ్యత్వ గుర్తింపు కార్డుల ధృవీకరణ వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు కూడా పాల్గొన్నారు. ఈ భేటీ పార్టీ కార్యకలాపాల పురోగతిని సమీక్షించే దిశగా జరిగింది.