విశాఖపట్నంలోని జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, అన్ని జోనల్ కార్యాలయాల్లో ఈ నెల 27న జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ ఆదివారం తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి తదితరుల పర్యటనల కారణంగా అధికారులు విధుల్లో నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.