ఐదేళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు శ్రీరామరక్ష లాంటివని, ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వీటిని వేయించాలని రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు పిలుపునిచ్చారు. ఆదివారం 75వ వార్డు మొల్లివానిపాలెం కమ్యూనిటీ హాల్‌లో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఏఎన్ఎం అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.