విశాఖ;కాలుష్యాన్ని నివారించలేం… నియంత్రించవచ్చు

6చూసినవారు
విశాఖ;కాలుష్యాన్ని నివారించలేం… నియంత్రించవచ్చు
కాలుష్యాన్ని పూర్తిగా నివారించలేమని, కానీ నియంత్రించవచ్చని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం విశాఖలో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పరిశ్రమలు కాలుష్య నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అధునాతన సాంకేతికతతో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని సూచించారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి తో పాటు కాలుష్యం కూడా పెరిగిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో 33 శాతం గ్రీన్ బెల్ట్ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పవన్ పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :