పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూర్ణ మార్కెట్ స్ప్రింగ్ రోడ్డులో ముఠా కార్మికులు నిరసన చేపట్టారు. సీఐటీయూ నాయకులు చంద్రశేఖర్, రష్యా, ఇరాన్ల నుంచి తక్కువ ధరకే చమురు వచ్చే అవకాశం ఉన్నా, ట్రంప్ భయంతో
మోదీ ప్రభుత్వం ప్రజలపై భారం వేస్తోందని ఆరోపించారు. ప్రజారోగ్య వేదిక నాయకులు చంద్రమౌళి, పెరిగిన ధరల వల్ల ముఠా కార్మికులు సరైన ఆహారానికి దూరమై, వడదెబ్బతో మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు ధరలు తగ్గించారని, ఇప్పుడు కూటమిలో ఉండి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.