తెలుగు శక్తి అధ్యక్షుడు బి. వి. రామ్ స్పష్టం చేసిన ప్రకారం, విశాఖ రైల్వే జోన్ గెజిట్ విడుదల వెనుక ఆ సంస్థ నిర్వహించిన మేధోమధనం సమ్మేళనం ప్రభావం ఉంది. ఇటీవల విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా జరిగిన సదస్సులో పాలకుల తీరుపై చేసిన విమర్శల వల్లే రాజకీయ నాయకుల్లో చలనం వచ్చిందని, రెండేళ్లుగా లేని పురోగతి ఇప్పుడు తమ పోరాట ఫలితమేనని ఆయన విశ్లేషించారు. రైల్వే జోన్ సాధించామని సంబరాలు చేసుకుంటున్న నేతలు, దమ్ముంటే విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే ఉంచుతామని కేంద్రంతో ప్రకటన చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.