రాబోయే మూడు గంటల్లో విజయనగరం, గజపతినగరం, భోగాపురం, భీమునిపట్నం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారం హెచ్చరించింది. మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి గంటకు 60 కి.మీ. వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలవకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.