విశాఖ: వైభవంగా కనకమహాలక్ష్మి అమ్మవారి రథయాత్ర

7చూసినవారు
విశాఖ: వైభవంగా కనకమహాలక్ష్మి అమ్మవారి రథయాత్ర
విశాఖపట్నంలోని బురుజుపేటలో గల శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం రథయాత్రను ఘనంగా నిర్వహించారు. జగదాంబ సమీపంలోని అంబికాబాగ్ నుండి ఆలయం వరకు జరిగిన ఈ రథయాత్రను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి, జెండా ఊపి ప్రారంభించారు. మేళతాళాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సాగిన ఈ యాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలు డిసెంబర్ 19న ముగియనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్