విశాఖ: మహిళలపై హింసను అరికట్టడంలో పాలకులు విఫలం

429చూసినవారు
విశాఖ: మహిళలపై హింసను అరికట్టడంలో పాలకులు విఫలం
విశాఖలోని ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఆదివారం జరిగిన ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశంలో, ప్రముఖ మహిళా ఉద్యమ నేత కె. సంధ్య మాట్లాడుతూ, మహిళలపై రోజురోజుకూ పెరుగుతున్న దాడులను అరికట్టడంలో పాలకులకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. డిజిటల్ వ్యవస్థ, పితృస్వామ్య భావజాలంతో మహిళలపై హింస మరింత అమానవీయంగా మారిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతిరోజూ జరుగుతున్న లైంగిక దాడులు, హత్యలపై ప్రభుత్వాల వైఖరిని ఆమె తప్పుబట్టారు. ఈ సమావేశంలో పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం. లక్ష్మి, ఉపాధ్యక్షురాలు రమా సుందరి, ఇతర మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్