ఆంధ్రప్రదేశ్‌ను ఏవియేషన్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మంగళవారం ఢిల్లీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ జీఎంఆర్ అధికారులతో సమావేశమై, విశాఖ వద్ద దేశంలోనే మొట్టమొదటి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ అభివృద్ధి ప్రణాళికను ఖరారు చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ ఎడ్యుసిటీ ద్వారా విమానయాన, రక్షణ రంగాల విద్య, శిక్షణలకు విశాఖ కేంద్రంగా మారుతుందని, ఉత్తరాంధ్రకు ఇది గేమ్ ఛేంజర్ అవుతుందని లోకేష్ తెలిపారు.