విశాఖపట్నంలో ఋషి పీఠం, సత్సంగం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీమద్భాగవత ప్రవచన యజ్ఞంలో 12వ రోజు సోమవారం షణ్ముఖ శర్మ ప్రవచనం చేశారు. భాగవతంలో రాధా దేవి శ్రీకృష్ణ పరమాత్ముడికి గూఢనాయకి అని, రాసలీల, యోగలీల వంటి దివ్య తత్త్వాలను అర్థం చేసుకోవడం భగవదానుగ్రహం పొందినవారికే సాధ్యమని తెలిపారు. రాధా దేవి సర్వశక్తుల స్వరూపమని, ఆమె అనుమతితోనే శుద్ధ భక్తి లభిస్తుందని, రాధా-కృష్ణుల ప్రేమ దివ్యానుభూతి అని, గోపికలు భక్తి పరాకాష్టకు ప్రతీకలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.