ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల ప్రస్థానంలో భాగస్వామ్యం కావడంపై సచిన్ తెందూల్కర్ హర్షం వ్యక్తం చేశారు. ఏయూ నుంచి వచ్చిన వారు వివిధ రంగాల్లో రాణించారని పేర్కొన్నారు. తన తండ్రి ప్రొఫెసర్ అని, చదువుపై ఆయనకున్న మక్కువను గుర్తుచేసుకున్నారు. తాను కూడా సాధారణ నేపథ్యం నుంచి వచ్చి, క్రికెటర్ అయ్యాకే కారు కొనుక్కున్నానని తెలిపారు. లక్ష్య సాధనలో అనుమానాలు వచ్చినా, పనిలో నిమగ్నమైతే ఒత్తిడిని అధిగమించవచ్చని, ఆత్మవిశ్వాసమే అసలైన ఆయుధమని విద్యార్థులకు సచిన్ పిలుపునిచ్చారు. నిరంతర సాధనతోనే క్రికెట్‌లో రాణించగలిగానని ఆయన స్పష్టం చేశారు.