కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం ఆసీలిమెట్ట పార్టీ కార్యాలయంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 30న జగదాంబ జంక్షన్ రమేష్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే బూత్ లెవెల్ ఏజెంట్ల ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ శిక్షణ కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ఓటర్ల జాబితా నమోదులో ఏజెంట్లు చొరవ చూపాలని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.