స్టీల్ సిటీ డిపో లీజు గడువు ముగియడంతో, రూ. 138 కోట్ల డిపాజిట్ లేకుండా యథాతథంగా కొనసాగించాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు బుధవారం మంత్రి డోలా వీరాంజనేయ స్వామిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాస రావు డిపో పరిస్థితిని మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన జిల్లా మంత్రి డోలా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.