వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సింహాచలం దేవస్థాన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 30 నుండి మే 3వ తేదీ వరకు శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి అంతరాలయ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఈఓ జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు. మే 1న వైశాఖ పౌర్ణమి మరియు రెండవ విడత చందన సమర్పణ ఉన్నందున ఆ రోజు అన్ని రకాల ఆర్జిత సేవలను కూడా రద్దు చేశారు. మే 1న ఉదయం 6:30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతి ఉంటుందని, భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని కోరారు.