విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలకు శనివారం రాట ముహూర్త కార్యక్రమంతో శుభారంభం జరిగింది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున రాట వేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్లు, ఆలయ ఉపకమీషనర్ కె. శోభారాణి, అధికారులు, వేదపండితులు, నాయకులు పాల్గొన్నారు. ముత్తైదువులకు తాంబూలం పంపిణీ చేశారు.