విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులోని వేలంపేట ప్రైమరీ స్కూల్‌లో శుక్రవారం మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ 3.0 జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్‌ఛార్జ్, ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉత్తమ విద్యా విధానం అమలవుతోందని, ఇతర రాష్ట్రాల్లో లేని పలు విద్యా పథకాలను ఏపీ అమలు చేస్తోందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.