విశాఖ,: బాల్య వివాహాలను నిర్మూలించే బాధ్యత అందరిపై ఉంది

13చూసినవారు
విశాఖ,: బాల్య వివాహాలను నిర్మూలించే బాధ్యత అందరిపై ఉంది
విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు బాల్య వివాహాలను నిర్మూలించే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. శుక్రవారం అల్లిపురం నేరెళ్ల కోనేరు అంగన్వాడి కేంద్రంలో బాల్యవివాహాలు నిషేధంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బాల్యవివాహం ఒక సాంఘిక దురాచారమని, 18 ఏళ్లు నిండకుండా బాలికలకు వివాహం చేయరాదని తెలిపారు. ప్రతి బాలిక రోల్ మోడల్గా ఎదగాలని, పురుషులతో సమాన అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్