విశాఖలోని జగదాంబ జంక్షన్ బస్ స్టాప్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుని శరీరంపై గాయాలు లేనందున అనారోగ్యం వల్ల చనిపోయాడా లేదా ఇంకా ఏదైనా కారణం ఉందా అనే దిశగా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించగా, అతని వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని సీఐ కోరారు.