విశాఖ‌: శ్రీ కనకమహాలక్ష్మిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

9చూసినవారు
విశాఖ‌: శ్రీ కనకమహాలక్ష్మిని దర్శించుకున్న కేంద్ర మంత్రి
కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ శనివారం విశాఖపట్నంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, మరియు అమ్మవారి చిత్రపటాన్ని మంత్రికి అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్