కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీగా మారిందని ఆమె మండిపడ్డారు. విశాఖపట్నంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్, ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించారని, ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.