విశాఖ: ఏడో రోజుకు చేరిన యోగాంధ్ర

2చూసినవారు
విశాఖ: ఏడో రోజుకు చేరిన యోగాంధ్ర
విశాఖపట్నం పాతనగరం బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అనివెట్టి మండపంలో యోగా శిక్షణా తరగతులు శనివారం ఏడో రోజుకు చేరుకున్నాయి. యోగ భారతి ట్రస్ట్ పర్యవేక్షణలో యోగా గురువు వై. సత్య సూర్యనారాయణమూర్తి ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు ఈ తరగతులు నిర్వహించారు. ఇందులో భాగంగా పాల్గొన్న వారితో వివిధ రకాల ఆసనాలను వేయించారు. దేవస్థాన వేదపండితులు, అర్చక స్వాములు, సిబ్బందితో పాటు స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రతి శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు శ్రీ అమ్మవారికి నిర్వహించే ప్రత్యేక తులసి దళార్చణ సేవలో ఉభయదాతలు పాల్గొని పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్