ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
విద్యార్థులు, నగరవాసులు వీక్షించేందుకు బీచ్ రోడ్డులో ఎల్ఈడీ స్క్రీన్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన దిశానిర్దేశం, ప్రేరణాత్మక మాటలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.