విశాఖ నగరంలో సుమారు 5 వేల కోట్ల రూపాయల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం సంస్థకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. జీవీఎంసీ తీర్మానం పేరుతో జరుగుతున్న ఈ భూదోపిడీని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన దీక్ష చేపట్టారు. ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన భూములను ఎంపీ శ్రీ భరత్‌కు చెందిన గీతం విద్యాసంస్థలకు ధారాదత్తం చేయడం దుర్మార్గమని, నిబంధనలకు విరుద్ధంగా జీవీఎంసీ కౌన్సిల్‌లో అజెండాను ప్రవేశపెట్టి ప్రజా ఆస్తులను దోచిపెడుతున్నారని కేకే రాజు మండిపడ్డారు.