విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జడ్పీ ఛైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ పరిధిలోని అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు విజయ కృష్ణన్, ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్, దినేష్ కుమార్ పాల్గొని అభివృద్ధి పనులపై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, కొప్పుల వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ పి. వి. జి. విజయ్ కుమార్, గవర కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ల సురేంద్ర, పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు హాజరై ప్రజా సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు.