వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో బుధవారం 'ప్రజా ఉద్యమం ర్యాలీ' నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె. కె రాజు ఆధ్వర్యంలో గురుద్వార్ జంక్షన్ నుండి సీతమ్మధార ఎమ్మార్వో ఆఫీస్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా వైసిపి నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వైద్య కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.