దక్షిణ విశాఖ - South Vizag

విశాఖ: అవినీతికి పాల్పడిన కేజీహెచ్ ఉద్యోగి తొలగింపు

విశాఖ: అవినీతికి పాల్పడిన కేజీహెచ్ ఉద్యోగి తొలగింపు

విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)లో రోగుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న అవుట్ సోర్సింగ్ శానిటేషన్ వర్కర్ సిరిపురాపు మధును విధుల్లోంచి తొలగించారు. శనివారం విశాఖ కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ కేజీహెచ్‌లోని బర్న్స్ వార్డును ఆకస్మికంగా తనిఖీ చేయగా, సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అధికారులు, మధు అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించి, అతడిని వెంటనే తొలగిస్తున్నట్లు ఏజెన్సీ జోనల్ ఇన్‌చార్జ్ ఎం. రామసుబ్బారావు ప్రకటించారు.

వీడియోలు


హైదరాబాద్
శత్రువు అనుకున్నోన్ని బండకేసికొట్టాను: సీఎం రేవంత్ రెడ్డి
Jan 17, 2026, 12:01 IST/

శత్రువు అనుకున్నోన్ని బండకేసికొట్టాను: సీఎం రేవంత్ రెడ్డి

Jan 17, 2026, 12:01 IST
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. తాము మంజూరు చేసిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉందా అని ప్రశ్నించారు. వేల కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారని, ఉద్ధండాపూర్ రైతులకు పరిహారం ఇచ్చి భూసేకరణ చేశారా అని నిలదీశారు. పాలమూరు బిడ్డ సీఎంగా ఉండటం వారికి కడుపుమంటగా ఉందని, అందుకే ప్రతిపక్ష నాయకుడు శుక్రాచార్యుడిలా వ్యవహరిస్తూ, బావబామ్మర్ది ముసుగులో మారీచుడు, సుబాహుడిని ప్రాజెక్టులను అడ్డుకోమని పంపుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి రాక్షసులను కట్టిపడేసే శక్తి పాలమూరు బిడ్డకు ఉందని అన్నారు.