
విశాఖ: కూటమి పాలనలో సంతోషం లేదు
శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, కూటమి పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల్లో సంక్రాంతి సంబరం కనిపించలేదని విమర్శించారు. మద్యం ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడంతో ప్రజలపై భారం పెరిగిందని, రైతులకు యూరియా కొరత, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన ఆరోపించారు.






































