Feb 07, 2026, 08:02 IST/కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్
సుచిత్ర సెంటర్లో 1. 9 కేజీల ఎండు గంజాయి స్వాధీనం
Feb 07, 2026, 08:02 IST
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుచిత్ర సెంటర్ వద్ద ఎక్సైజ్ పోలీసులు భారీగా ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బస్సులో గంజాయి తరలిస్తున్న మిర్జా అలీ భేగ్ అనే వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 1.9 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బస్సు ద్వారా అక్రమంగా గంజాయి తరలిస్తున్న సమయంలో పట్టుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.