విశాఖపట్నం రైల్వే స్టేషన్ పరిసరాల్లో సిటీ డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో సుమారు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్ ఆవరణలో పడి ఉన్న రెండు అనుమానాస్పద బ్యాగులను డాగ్ స్క్వాడ్ గుర్తించగా, వాటిని తెరిచి చూడగా గంజాయి బయటపడింది. రైల్వే స్టేషన్ ద్వారా ఇతర ప్రాంతాలకు గంజాయిని తరలించేందుకు దుండగులు యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేసి, దర్యాప్తును వేగవంతం చేశారు.