సింహాచలం పంచగ్రామాల భూ సమస్యపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో మాట్లాడారు. 3 దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరారు. సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని, అడ్వకేట్ జనరల్‌తో చర్చించి న్యాయపరమైన చిక్కులు తొలగించాలని విన్నవించారు. 12,149 కట్టడాల క్రమబద్ధీకరణ ద్వారా వేలాది కుటుంబాలకు ఊరటనివ్వాలని, ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేయాలని ఎమ్మెల్యే గంటా విజ్ఞప్తి చేశారు.