విశాఖ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGVB) మొత్తం 20 నాన్-టీచింగ్ ఉద్యోగాలకు (టైప్-3లో 06, టైప్-4లో 14) ఔట్ సోర్సింగ్ పద్ధతిలో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ నెల 20తో ముగియనుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. దరఖాస్తులను జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలి. ఫిబ్రవరి 2న ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి.