విశాఖలోని అగనంపూడి-డెంకాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫార్మాసిటీకి చెందిన బస్సు రోడ్డు పక్కన ఆగి ఉండగా, వేగంగా వచ్చిన ఆటో దానిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. దువ్వాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.