విశాఖ పశ్చిమంలో ఘనంగా డిజిటల్ మహానాడు–2026

14చూసినవారు
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ప్రతిష్టాత్మక 'డిజిటల్ మహానాడు 2026' కార్యక్రమం ఎమ్మెల్యే గ‌ణ‌బాబు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. అధునాతన డిజిటల్ విప్లవానికి అనుగుణంగా, హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎన్టీఆర్ ఆశయాల సాధన, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్