విశాఖలోని అయోధ్య నగర్‌లో నివాసం ఉంటున్న వ్యక్తి (36) బాలికపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు వచ్చిందని పీఎంపాలెం సీఐ బాలకృష్ణ బుధవారం తెలిపారు. బాలిక సదరు వ్యక్తిని మావయ్య అని పిలిచేది. ఆ పరిచయంతో మే 12న ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ మధ్య కాలంలో బాలికకు కడుపునొప్పి రావటంతో గట్టిగా అడగ్గా అసలు విషయం తెలిసిందని బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సదరు వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.