విశాఖపట్నం జిల్లా నూతన డీఆర్వో (జిల్లా రెవెన్యూ అధికారి)గా విశ్వేశ్వర నాయుడు నియమితులయ్యారు. ఆయన శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో పుష్పగుచ్ఛం అందజేసి, జిల్లా అభివృద్ధిపై కాసేపు చర్చించారు.