పెందుర్తి: పురుషోత్తపురంలో ఉచిత మానసిక ఆరోగ్య శిబిరం

980చూసినవారు
పెందుర్తి: పురుషోత్తపురంలో ఉచిత మానసిక ఆరోగ్య శిబిరం
పురుషోత్తపురం యూపీహెచ్‌సీలో వాసవ్య మహిళా మండలి, విశాఖ ప్రభుత్వ మానసిక వైద్యశాల సహకారంతో ఉచిత మానసిక ఆరోగ్య శిబిరం జరిగింది. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా. అమ్మాజీరావు 60 మంది రోగులకు పరీక్షలు చేసి, మందులు, సలహాలు అందించారు. తీవ్ర సమస్యలున్న వారిని విశాఖ ఆసుపత్రికి రిఫర్ చేశారు. వాసవ్య మహిళా మండలి ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయ కౌన్సిలర్ జి. సాయి లక్ష్మి, వాసవ్య మహిళా మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఎం. అబ్రహాం, ప్రతినిధులు హేమ, వరలక్ష్మి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్