భర్తతో గొడవల కారణంగా మనస్తాపానికి గురై, ఇద్దరు పిల్లలను వదిలి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిన ఓ గృహిణిని మహారాణిపేట పోలీసులు సకాలంలో స్పందించి క్షేమంగా కాపాడారు. బాధిత మహిళ ఆత్మహత్యాయత్నానికి వెళ్లినట్లు సమాచారం అందిన వెంటనే మహారాణిపేట సీఐ దివాకర్ యాదవ్ అప్రమత్తమై ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. గాలింపు చర్యలు చేపట్టి ఆమెను సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఆమెకు తగిన కౌన్సెలింగ్ ఇచ్చి, లీగల్ కౌన్సెలింగ్ అనంతరం తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.