సింహాచలంలో వైభవంగా రాపత్తి ఉత్సవాలు

శ్రీ శ్రీ వరలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న రాపత్తి ఉత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. గురువారం సాయంకాలం స్వామివారు నవరత్న ఖచిత కిరీటం, కౌస్తుభ మణిహారాలు, సువర్ణ హారాలు, పుష్పమాలలతో తేజోమయంగా భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రోచ్ఛారణలు, నాదస్వర మంగళధ్వనుల మధ్య ఉత్సవ మూర్తులను సభా మండపానికి వేంచేపు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు భక్తులకు కన్నుల పండువగా సాగుతున్నాయి.
