వడదెబ్బతో పారిశుద్ధ్య కార్మికుడు మృతి

5చూసినవారు
వడదెబ్బతో పారిశుద్ధ్య కార్మికుడు మృతి
విశాఖపట్నంలోని AU ఇంజినీరింగ్ గ్రౌండ్స్ మెట్లపై బుధవారం ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు మర్రిపాలెంకు చెందిన AU కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడు సూరిబాబుగా గుర్తించారు. వడదెబ్బ కారణంగానే మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని KGHకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్