సింహాచలం అప్పన్న స్వామివారి పులిహోరలో నత్త వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంపై నిజాలు తేల్చాలని దేవస్థానం ఏఈఓ రమణమూర్తి బుధవారం గోపాలపట్నం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈనెల 29వ తేదీన స్వామివారి దర్శనం అనంతరం ఒక భక్తుడు, భక్తురాలు పులిహోర కొనుగోలు చేయగా అందులో నత్త ఉందని సోషల్ మీడియాలో ఆరోపణ చేశారు. వంట సిబ్బందిని విచారించిన అనంతరం, సదరు వ్యక్తులపై అనుమానం రావడంతో స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.