విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ జూన్ 1 నుంచి తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించనుంది. సిరిపురంలోని VMRDA ‘ది డెక్’ భవనంలో తాత్కాలిక కార్యాలయం సిద్ధం చేయబడింది. ఈ నూతన జోన్ పరిధిలో VJA, గుంటూరు, గుంతకల్లు, విశాఖ డివిజన్లు ఉంటాయి. మొత్తం 3,532 రూట్ కిలోమీటర్లు, 385 స్టేషన్లు ఈ జోన్‌లో భాగం కానున్నాయి. జోన్ ప్రధాన కార్యాలయంలో 128 మంది గెజిటెడ్ అధికారులు, 1,100 మంది నాన్ గెజిటెడ్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.