సింహాచలంలో ఆన్‌లైన్‌లో సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకునే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయనున్నారు. భక్తులు ఆలయానికి వచ్చినప్పుడు వేచి ఉండకుండా వేగంగా దర్శనం చేసుకునేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఆలయ ఈఓ ఎన్. సుజాత, ఇంజనీరింగ్ అధికారులు ఈ ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆన్‌లైన్ టికెట్ కలిగిన భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఈఓ అధికారులకు సూచించారు.