విశాఖలో పర్యాటకుల సందడి

1042చూసినవారు
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని VMRDA పార్క్, కైలాసగిరి, సెంట్రల్ పార్క్, తెలుగు మ్యూజియం, సబ్మెరైన్, TU-142 ఎయిర్ క్రాఫ్ట్, సీ-హారియర్, హెలికాప్టర్ మ్యూజియంలలో ఉచిత ప్రవేశం కల్పించారు. దసరా సెలవులు, వారాంతం కలిసి రావడంతో సందర్శకుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఆహ్లాదకరమైన వాతావరణం పిల్లలు, పెద్దలను ఆకట్టుకుంది. ముఖ్యంగా మ్యూజియంల వద్ద సందర్శకుల బారులు తీరాయి.

సంబంధిత పోస్ట్