విశాఖ‌: సఫ్దర్‌ హష్మికి ఘన నివాళి

1చూసినవారు
విశాఖ‌: సఫ్దర్‌ హష్మికి ఘన నివాళి
ప్రజా కళాకారుడు, వీధి నాటక వైతాళికుడు సఫ్దర్‌ హష్మి వర్థంతిని విశాఖ‌లోని ప్రజానాట్యమండలి కార్యాలయంలో శుక్ర‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు. సీనియ‌ర్ క‌ళాకారులు, గౌర‌వాధ్య‌క్షులు అరుణ్‌జి స‌ఫ్ద‌ర్ హ‌ష్మి చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. దేశ ఆర్థిక ప‌రిస్థితులు, ధ‌ర‌ల నియంత్ర‌ణ, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న చేసిన రచనలు, ప్ర‌ద‌ర్శించిన వీధి నాట‌కాలు ఎంతో స్ఫూర్తిదాయ‌క‌మ‌ని ఈ సంద‌ర్భంగా కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో నృత్య క‌ళాకారులు ప‌ద్మ‌, రాగిణి, ప్ర‌జానాట్య‌మండ‌లి చిన్నారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్